»Do You Buy Ready To Eat Salads Heres A Health Warning
Ready To Eat Salads : బయట రెడీ టు ఈట్ సలాడ్లు తింటున్నారా? ఇది తెలుసుకోండి!
బయట ఎంతో ఆకర్షణీయంగా కనిపించే రెడీ టు ఈడ్ సలాడ్లను మీరు తరచుగా తింటున్నారా? అవి తినేందుకు ఏమంత సురక్షితం కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే....
పనుల్లో భాగంగా బయటకు వెళ్లినప్పుడు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపేవారంతా నూనెల్లో వేపించిన పదార్థాల్లాంటి వాటిని తినడానికి ఇష్టపడరు. బదులుగా ఆరోగ్యకరంగా ఉండే పండ్ల సలాడ్లు, వెజిటెబుల్ సలాడ్లు లాంటి వాటిని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే మాల్స్, పెద్ద పెద్ద దుకాణాల్లోనూ ఈ మధ్య ఇలా రెడీ టు ఈట్ సలాడ్లను(Ready To Eat Salads) అమ్మకానికి పెడుతున్నారు. తినడానికి తేలికగా ఉంటుందని చాలా మంది వీటిని కొనుక్కుని ఇంటికి పట్టుకెళుతూ ఉంటారు. ఆరోగ్యం కోసం తినే వీటి వల్ల అనారోగ్యాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రస్తుత అధ్యయనాలు చెబుతున్నాయి.
రెడీ టు ఈట్ సలాడ్లపై జరిగిన ఓ పరిశోధనలో దిగ్భ్రాంతిని కలగజేసే ఫలితాలు కనిపించాయి. శాస్త్రవేత్తలు తీసుకున్న శాంపుళ్లు అన్నింటిలోనూ సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియాలు 0.6శాతం నుంచి 26.7 శాతం వరకు ఉన్నాయి. అలాగే 0.7శాతం నుంచి 100 శాతం వరకు ఎస్చెరిచియాకోలీ బ్యాక్టీరియా కనిపించింది. శాస్త్రవేత్తలు తీసుకున్న అన్ని శాంపుళ్లలోనూ దాదాపుగా ప్రమాకరమైన బ్యాక్టీరియాలు ఉండటంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలాంటి సలాడ్లను తినడం కంటే తినకపోవడమే మంచిదని సూచించారు. ఇలాంటి వాటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలుంటాయని తెలిపారు.
కొన్ని ఫుడ్ జర్నల్స్‌లో వచ్చిన వార్తల ఆధారంగా చూస్తే ఇలా ముందే కత్తిరించి పెట్టిన సలాడ్లలో(Salads) బ్యాక్టీరియాలు పెరిగిపోయే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో అమ్మకానికి పెట్టాలి కాబట్టి చాలా మంది మనుషులు వీటిని కత్తిరించాల్సి ఉంటుంది. వారు చేతులను శుభ్రం చేసుకున్నారా లేదా? ప్యాకింగ్ చేసేప్పుడు సరైన సేఫ్టీ ప్రమాణాలను పాటించారా లేదా? అనే విషయాల ఆధారంగా ఆ సలాడ్ పొల్యూటైనదా? లేకపోతే సరైనదా? అనే విషయం ఆధారపడుతుంది. మార్కెట్లలో దొరికే కొన్ని సలాడ్లను తీసుకొచ్చి పరీక్షలు చేసినప్పుడు చాలా వాటిలో బ్యాక్టీరియా కంటెంట్ ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.