»How To Maximize Mobile Battery Life Charging Habits And Other Tips
Mobile charging : ఫోన్ ఛార్జింగ్ సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
మొబైల్ బ్యాటరీ ఎక్కువ కాలం పాటు పాడుకాకుండా ఉండాలంటే ఛార్జింగ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తల్ని తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...
Mobile charging tips : ఇటీవల కాలంలో చాలా మంది ఎక్కువ సేపు మొబైల్లోనే గడుపుతున్నారు. అందుకనే ఖాళీ ఉన్నప్పుడల్లా దాన్ని ఛార్జ్ చేస్తూ వస్తున్నారు. ఇలా ఎప్పుడంటే అప్పుడు ఛార్జింగ్‌లో పెడుతూ ఉండటం వల్ల దాని లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా ఛార్జింగ్ పెట్టాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తల్ని తీసుకుంటే దాని లైఫ్ టైం పెరుగుతుంది. ఐదేళ్లయినా బ్యాటరీ పాడు కాకుండా ఉంటుంది.
కొంత మంది ఛార్జింగ్(charging) తక్కువ ఉందని చెప్పి ప్లగ్ ఆన్ చేస్తారు. బ్యాటరీ 20, 30 శాతం ఛార్జ్ కాగానే మళ్లీ తీసేసి వాడుతుంటారు. ఇది ఎంత మాత్రమూ సరైనది కాదు. బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం రావాలంటే ఛార్జ్ 20 శాతం లోపునకు వచ్చాక ఛార్జింగ్ పెట్టాలి. అలాగే 80, 90 శాతం ఛార్జ్ అయ్యే వరకు దాన్ని ప్లగ్ నుంచి తీయకూడదు.
ఫోన్(Mobile Phone) ఛార్జింగ్ 0 అయిపోయే వరకు ఎప్పుడూ ఉంచకూడదు. అది బ్యాటరీ లైఫ్‌ని దారుణంగా దెబ్బ తీస్తుంది. అలాగే వంద శాతం చార్జ్ అయిపోయినా ప్లగ్ ఆన్ చేసి కొంత మంది రాత్రంతా అలా ఉంచేస్తూ ఉంటారు. ఇవి రెండూ కూడా సరైనవి కావు.
ఛార్జింగ్ చేయడానికి సంబంధిత ఫోన్ కంపెనీ వారు అందించే ఛార్జర్‌ని వాడటం ఉత్తమం. అలా కాకుండా తక్కువ ధరల్లో దొరికే ఛార్జర్లు వాడటం వల్ల బ్యాటరీ లైఫ్ తొందరగా దెబ్బ తింటుంది. అలాగే ఛార్జ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని మరో వస్త్రంతో గాని, కవర్తోగాని పూర్తిగా మూయకూడదు. అందువల్ల అది అతిగా వేడెక్కిపోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి.