»This Is Very Bad Star Hero With Porn Star What About Deepika
Deepika Padukone: ఇది మరీ దారుణం.. పోర్న్ స్టార్‌తో స్టార్ హీరో, మరి దీపిక పరిస్థితేంటి?
బాలీవుడ్ యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. కానీ అతను చేసే కొన్ని పనులు మాత్రం దారుణంగా ఉంటాయి. ఇప్పుడు రణ్ వీర్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. దీంతో దీపిక పదుకొనే పరిస్థితేంటి? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
This is very bad.. star hero with porn star, what about Deepika?
Deepika Padukone: ఆ మధ్యో పేపర్ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ సెన్సేషన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేసేశాయి. కొందరు రణ్వీర్ గట్స్‌కు హ్యాట్సాఫ్ అంటే.. కొందరు మాత్రం విరుచుకు పడ్డారు. కానీ ఈ న్యూడ్ ఫొటోషూట్.. రణ్వీర్ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే.. తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది. మామూలుగానే దీపికా ప్రతి విషయంలో తన భర్తకు సపోర్ట్‌గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి అడ్డు చెప్పే ఛాన్స్ లేదని చెప్పొచ్చు. మరో వైపు దీపిక కూడా పెళ్లైన తర్వాత బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోతోంది. ఏ మాత్రం హద్దులు లేకుండా దూసుకుపోతోంది. కానీ లేటెస్ట్గా రణ్ వీర్ చేసిన ఓ పని మాత్రం చాలా దారుణంగా ఉందని అంటున్నారు. సినిమాలతో పాటు వరుస యాడ్స్ చేస్తున్న రణ్వీర్.. తాజాగా ఓ యాడ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోని కూడా రణ్ వీర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ వీడియోలో సెక్సువల్ హెల్త్ కేర్ బ్రాండ్ బోల్డ్ కేర్ అనే బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్టుగా కనిపించాడు. పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ వీడియోలో.. తమ ప్రొడక్ట్‌తో లైంగిక ఆరోగ్యం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. యాడ్ వరకు బాగానే ఉన్నా.. ఇందులో రణ్ వీర్ సింగ్ ప్రముఖ అమెరికన్ పోర్న్‌స్టార్ జానీ సిన్స్‌తో కలిసి కలిసి కనిపిచడమే హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. జానీ సిన్స్ అంటే ఫీమేల్ పోర్న్ స్టార్ అనుకునేరు.. అతను మేల్ పోర్న్ స్టార్. ఇక ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో రణవీర్ సింగ్‌ని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అసలు పోర్న్ స్టార్‌తో యాడ్ ఏంట్రా? ఇది మరీ దారుణం.. పాపం దీపిక పరిస్థితేంటో? అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఏదేమైనా.. రణ్ వీర్ సింగ్ తనకు ఏది అనిపిస్తే అది చేసేస్తాడని మరోసారి ప్రూవ్ అయింది.