»Vijay Devarakonda Vijay Devarakonda In Allu Arjuns Next Place
Vijay Devarakonda: అల్లు అర్జున్ తర్వాతి ప్లేస్‌లో విజయ్ దేవరకొండ!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రౌడీ హీరో.. తాజాగా మరో ల్యాండ్ మార్క్ అందుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ తర్వాతి ప్లేస్‌లో నిలిచాడు.
Vijay Devarakonda: టాలీవుడ్ హీరోలను తీసుకుంటే.. ఇన్‌స్టా గ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా టాప్ ప్లేస్‌లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండ మరో ల్యాండ్ మార్క్‌కు చేరుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్‌లో 21 మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్నాడు రౌడీ. దీంతో అల్లు అర్జున్ తర్వాత అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. పుష్ప మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ.. 25 మిలియన్స్ ఫాలోవర్స్‌కు చేరువలో ఉన్నాడు. ఇప్పుడు 21 మిలియన్స్ ఫాలోవర్స్‌తో రౌడీ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విజయ్ దేవరకొండ.. తన కెరీర్ గురించి కొత్త సినిమాల అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటు ఉంటాడు. తన గురించి వచ్చే రూమర్స్‌తో పాటు.. సోషల్ ఇష్యూస్ మీద కూడా స్పందిస్తుంటాడు. అందుకే.. విజయ్ దేవరకొండ మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో విజయ్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఒకవేళ లైగర్ మూవీ హిట్ అయి ఉంటే.. రౌడీ క్రేజ్ మరింత పెరిగి ఉండేది.
ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్. గీతా గోవిందం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి గ్రాండ్‌గా రాబోతోంది. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. మరి ఈ సినిమాల తర్వాత రౌడీ ఫాలోయింగ్ ఎంతవరకు పెరుగుతుందో చూడాలి.