Poonam Pandey: పూనమ్ పాండే పై ఆర్జీవీ ట్వీట్.. వైరల్
తాను చనిపోయినట్లు చేసిన ప్రకటన కేవలం సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కోసమే అని పూనమ్ పాండే వెల్లడించిన నేపథ్యంలో నెట్టింట్లో ట్రోల్ అవుతుంది. దీనిపై తాజాగా ఆర్జీవి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
Poonam Pandey: నటీ, మోడల్ పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్(Cervical cancer) కారణంగా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. తన మేనేజర్ స్వయంగా చెప్పడంతో అంతా నిజమే అని నమ్మారు. తాజాగా పూనమ్ పాండే(Poonam Pandey) ఓ వీడియోను విడుదల చేసింది. తాను బతికే ఉన్నట్లు తెలిపింది. కేవలం సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు అలా చెప్పాను అని తెలిపింది. దీంతో తన అభిమానులు సంతోషపడ్డారు. మరో వైపు చాలా మంది అది కేవలం పబ్లిసిటీ స్టంట్ అంటూ తనపై విమర్షలు గుప్పిస్తున్నారు. నెట్టింట్లో తనపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
‘హేయ్ పూనమ్ పాండే… సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నీవు ఎంచుకున్న విధానం కొంత విమర్శలకు తావివ్వొచ్చు. అందులో సదుద్దేశం ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. దీని ద్వారా నువ్వు ప్రజల ప్రేమను పొందొచ్చు, పొందకపోవచ్చు కానీ అంతటా గర్భాశయ క్యాన్సర్ పైనే చర్చ జరుగుతోందంటే దానికి కారణం నువ్వే. మార్గం ఏదైనా అనుకున్నది సాధించావు. నీ మాదిరేగానే నీ ఆత్మ కూడా చాలా అందమైనది. సంపూర్ణమైన, సంతోషకరమైన జీవితం నీకు ఉంటుందని విశ్వసిస్తున్నాను అని ఆర్జీవి(RGV Tweet) పోస్ట్ చేశారు.