6-month-old baby in Nobel World Records.. Amazing memory
Nobel World Record: ఇది 5జీ జనరేషన్.. నెట్ వర్క్‌లోనే కాదు పిల్లల మైండ్ సెట్ కూడా అంతే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. పుట్టి ఆరునెలలు కూడా పూర్తిగా నిండలేదు తన జ్ఙాపశక్తి(Amazing memory)తో నోబెల్ వరల్డ్ రికార్డు(Nobel World Record)ను సాధించింది. కృష్ణాజిల్లా యనమలకుదురుకు చెందిన ఇడుపులపాటి తనుజ, నితిన్ దంపతులు. హైదరాబాద్(Hyderabad)లో సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటూ నగరంలో నివాసం ఉంటున్నారు. వారికి 5 నెలలు నిండిన పాప జైత్రి ఉంది. పుట్టిన కొద్దిరోజులకే తల్లిదండ్రులు పాప ప్రతిభను గుర్తించారు. దాంతో 100కు పైగా మొక్కల సాధారణ పేర్లతో సహా, వాటి సైంటిఫిక్ నేమ్స్ కూడా చెప్తే.. ఫ్లాష్ కార్డు ఆల్బమ్‌లోని ఆ మొక్కలను గుర్తించేలా శిక్షణ ఇచ్చారు. దాంతో ఏ పేరు చెప్పిన ఆ మొక్కను చూపిస్తుంది.
విషయం తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన నోబెల్ వరల్డ్ రికార్డు సంస్థ వారు పాపను పరీక్షించారు. వారు ఏ పేరు చెప్పిన వెంటనే ఆ మొక్కను గుర్తుపట్టింది ఈ చిన్నారి. పాప అద్భుత జ్ఙాపకశక్తికి ముగ్దులయ్యారు. అతి చిన్న వయస్సులో ఇంతటి ప్రతిభను కనబరిచిన జైత్రికి సర్టిఫికెట్, మెడల్ ఇచ్చి సత్కరించారు. విషయం తెలుసుకున్న పాప బంధువులు మురిసిపోతున్నారు. పిల్లల ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించడం ఎంతో ముఖ్యం అని, అలా చేస్తే పిల్లల అభిరుచి ఏంటన్నది చిన్నప్పటి నుంచే గమనించవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు.