AP: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. అలిపిరి పీఎస్ పరిధి రాజారెడ్డి నగర్లో రీల్స్ చేస్తూ 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఐదో అంతస్తులో రీల్స్ చేస్తున్న బాలిక ఒక్కసారిగా కిందపడిపోయింది. మరణించడంతో ఆమె బాడీని తిరుపతి రుయాకు తరలించారు. ఆమె కుటుంబం నేపాల్ నుంచి రాగా.. తండ్రి బహదూర్ అదే అపార్ట్మెంట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు.