మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామాయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారిపై రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నమ్మదగిన సమాచారంతో చేపట్టిన ఈ దాడుల్లో వే బిల్లు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక లారీని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమించి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.