అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధుల కోసం మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. ఉదయం నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివిధ రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం, సమాచార, ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.