ఖమ్మంలో బీఅర్ఎస్ ఆవిర్భావ సభ పది రోజుల క్రితం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మం తర్వాత ఏపీలోని విశాఖలో రెండో బహిరంగ సభ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే మహారాష్ట్రలో ఉండనుంది. నాందేడ్‌లో వచ్చే నెల 5వ తేదీన బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పోలీసుల అనుమతి వచ్చింది. 5న కెసిఆర్ సమక్షంలో పలువురు నేతలు బిఅర్ఎస్ లో చేరనున్నారు.
నాందేడ్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు సమీప ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. నాందేడ్ సభ సన్నాహకాల్లో భాగంగా శనివారం కిన్వట్ తాలూకాలో నాయకులను, ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కెసిఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. ఇందులో భాగంగా పార్టీ లక్ష్యాలను మహరాష్ట్రవాసులకు వివరించేందుకు బహిరంగ సభను నిర్వహిస్తున్నందున, మనమంతా కేసీఆర్ తో కలిసి నడుద్ధామన్నారు.