ఇప్పటికీ త్రిష, తమన్నా, నయనతార లాంటి హీరోయిన్లు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ ఇటీవల తెరంగేట్రం చేసిన హీరోయిన్ల కెరీర్ సంవత్సరాల కాలంలోనే ఫేడవుట్ అవుతున్నారు. ఇప్పుడు శ్రీలీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
What about Srileela's situation? In the danger zone?
Srileela: ఒక్క సినిమా శ్రీలీలకు ఏకంగా అర డజనుకు పైగా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. పెళ్లి సందడి సినిమా తర్వాత అమ్మడి అందానికి, ముఖ్యంగా డ్యాన్స్‌కు తెలుగు అడియెన్స్ ఫిదా అయిపోయారు. ధమాకా సినిమాay డ్యాన్స్‌తో దుమ్ములేపిన శ్రీలీల.. పర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా ఆఫర్లు అందుకోలేకపోయింది. కేవలం డ్యాన్స్ కోసం శ్రీలీలను తమ సినిమాల్లో తీసుకున్నట్టుగా ఉంది. ఒక్క భగవంత్ కేసరి తప్పితే శ్రీలీల చేసిన సినిమాల్లో ఆమె పాత్రకు ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. రీసెంట్గా వచ్చిన గుంటూరు కారంలోను డ్యాన్స్‌కు పరిమితమైంది. గుంటూరు కారం నుంచి వెనక్కి వెళితే.. నెలకో సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది అమ్మడు. కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం శ్రీలీల చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.
ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో ఏదైనా పెద్ద సినిమా ఉందా అంటే? అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎప్పుడు బ్రేక్ పడింది. ఏపీ ఎన్నికలు అయిపోతే గానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందో? ఉండదో? చెప్పలేం. అందుకే హరీష్ శంకర్, రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పట్లో శ్రీలీను వెండితెరపై చూడాలేం. దీంతో శ్రీలీల కెరీర్ డేంజర్ జోన్లో పడిందనే చెప్పాలి. ప్రభాస్, హనురాఘవపూడి ప్రాజెక్ట్ కోసం శ్రీలీల పేరు పరిశీలనో ఉంది కానీ, పక్కా ఛాన్స్ ఇస్తారని చెప్పలేం. మొత్తంగా శ్రీలీల పరిస్థితేంటి? అనేది హాట్ టాపిక్‌గా మారింది. అన్నట్టు.. శ్రీలీల లాగే కృతి శెట్టి కూడా ఓ రేంజ్లో ఆఫర్లు అందుకుంది. కానీ కథల ఎంపికలో తడబడింది. ఇప్పుడు శ్రీలీల కూడా అలాగే చేసింది. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా సమాచారం.