Meenakshi Chaudhary: ముద్దు పెడతా, కానీ అలా అయితేనే? గుంటూరు కారం హీరోయిన్
ప్రజెంట్ ఉన్న యంగ్ బ్యూటీస్‌లో మీనాక్షి చౌదరి వరుస ఆఫర్స్ అందుకుంటోంది. చివరగా గుంటూరు కారంలోను మెప్పించింది. ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయని.. ముద్దు సీన్లకు ఓకె చెబుతుందంటే పొరబడ్డట్టే. అలా అయితేనే లిప్ లాక్ అంటోంది.
Meenakshi Chaudhary: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు సినిమాలో ముందుగా పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్గా, శ్రీలీలను సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమోగానీ.. సడెన్‌గా పూజా హెగ్డేని మధ్యలో నుంచి తప్పించి శ్రీలీలను మెయిన్ హీరోయిన్ను చేసి.. మీనాక్షి చౌదరికి సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. సినిమాలో అమ్మడి పాత్రకు వెయిటేజ్ తక్కువే కానీ, మహేష్‌తో నటించే ఛాన్స్ అంటే లక్ అనే చెప్పాలి. అందుకే.. ‘సూపర్‌స్టార్‌తో ఛాన్స్ రాగానే ఎగిరిగంతేశాను.. నా ఆనందానికి అవధులు లేవు’.. అని ఆ మధ్య తెగ సంబరపడిపోయింది. ప్రస్తుతం మీనాక్షి చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. తెలుగులో పాటు తమిళ్లోను ఆఫర్లు అందుకుంటోంది. అయితే.. హీరోయిన్లంటే గ్లామర్ రోల్స్‌తో పాటు అవసరమైతే లిప్ లాక్ కూడా చేయాల్సిందే. మీనాక్షి చౌదరి కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ లిప్ లాక్ చేయాలంటే ఓ కండీషన్ ఉందని చెబుతోంది అమ్మడు.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముద్దు సీన్ల గురించి చెప్పుకొచ్చింది. ఈ విషయంలో కొన్ని నియమాలు పెట్టుకున్నాను. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే తప్ప, అదికూడా మరీ అసభ్యకరంగా లేకుంటేనే చేస్తాను. కేవలం ముద్దు సీన్స్ కోసమే అంటే నిస్సందేహంగా నో చెప్పేస్తానని.. చెప్పుకొచ్చింది. అలాగే.. తెలుగు ఆడియెన్స్ తనపై చాలా ప్రేమను చూపిస్తున్నారని.. అందుకే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.. అని తెలిపింది. మరి అమ్మడు ఎప్పుడు హద్దులు దాటుతుందో? ఎలాంటి సీన్స్ పడితే ముద్దు పెడుతుందో చూడాలి.