MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఓ మహిళ, మరో మహిళ పుస్తెలతాడు దొంగలించడానికి ప్రయత్నం చేసింది. సాధ్యం కాకపోవడంతో బస్సుల కోసం వేచి ఉన్న జనం గుంపులో చేరింది. అది గమనించిన అక్కడి వారు చితకబాదారు. చీపురుకట్టతో కొట్టి మరీ బుద్ధి చెప్పారు. అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.