»Elon Musk Uno Abolished India Given Permanent Membership
Elon Musk: ఐక్యరాజ్య సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలి
ప్రపంచంలో అతి ఎక్కువ జనభాగా అవతరించిన భారతదేశానికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం మంచిది కాదని టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. దీనిపై అంతర్జాతీయంగా చర్చ సాగుతోంది.
Elon Musk UNO abolished... India given permanent membership
Elon Musk: ఐక్యరాజ్యసమితి(UNO)లో ఇండియాకు శాశ్వత సభ్యత్వం లేదన్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా దీనిపై చర్చ నడుస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం సరైంది కాదని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్(Elon Musk) అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ఆయా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికన్న ముందు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ట్వీట్ చేశారు. భద్రతా మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి ఒక్క దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ ట్వీట్ పై ఇజ్రాయెల్ వెంచర్ క్యాపిటలిస్ట్ మైఖేల్ ఐసెన్ బర్గ్ స్పందిస్తూ.. మరి భారత దేశం సంగతేంటని గుటెర్రస్ ను ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితిని పూర్తిగా రద్దు చేసి, సరికొత్త నాయకత్వంతో, ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా మరో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని ఐసెన్ బర్గ్ సూచించారు.
వీరి చర్చలపై ఎలన్ మస్క్(Elon Musk) స్పందించారు. భూమి మీద అత్యధిక జనాభా గల భారత్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని తెలిపారు. ఐరాస అనుబంధ సంస్థలలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. అధికారాన్ని వదులుకోవడం ఏ దేశానికి ఇష్టం లేదని, అందుకే ఈ సమస్య అలాగే ఉండిపోయిందని మస్క్ ట్వీట్ చేశారు. ఐరాసలో భారత దేశానికి సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా దేశాలలో చైనా తప్ప మిగితా దేశాలు భారత్కు సపోర్ట్ చేస్తున్నాయి. వీటి వీటో పవర్ ఉంటుంది. ఈ మండలిలో ఉన్నన 5 దేశాలలో ఏ ఒక్క దేశంత అంగీకరించకపోయిన నిర్ణయం వీగిపోతుంది. అందుకే భారత్ శాశ్వత సభ్యత్వం పొందడం లేదు.