AP: ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు. తిరుపతిలోనే 10,659 ఇళ్లు నిర్మించి అందించామన్నారు. 2.50 లక్షల గృహప్రవేశాలు జరుగుతున్నాయంటే రికార్డు అని, కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి గృహప్రవేశాలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.