Srileela: పుష్ప2’లో శ్రీలీల? అయితే మామూలుగా ఉండదు!
ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ స్టేజీలో ఉంది. పార్ట్ 1 కంటే భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఏకంగా వెయ్యి కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు పుష్పరాజ్. అయితే లేటెస్ట్ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Srileela: ఇటీవల పుష్ప పార్ట్ 1లో కేశవగా కీలక పాత్ర పోషించిన జగదీష్ అరెస్ట్ అవడంతో.. పుష్ప2 షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడింది. జగదీష్ పై చిత్రీకరించాల్సిన సీన్లు చాలా ఉన్నాయట. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జగదీష్‌ని బెయిల్‌పై బయటికి తీసుకొచ్చారట. ప్రజెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జాతర సీన్లు చిత్రీకరిస్తున్నారట. ఇందులో కొన్ని కీలకమైన సీన్లతోపాటు యాక్షన్ సీన్లని చిత్రీకరించనున్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. పుష్ప2 ఐటెం బ్యూటీ ఎవరు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నిన్న మొన్నటి వరకు దిశా పటానీ, కృతి సనన్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల పైరు తెరపైకి వచ్చింది. పార్ట్ 1లో సమంత చేసిన ఐటెం సాంగ్ దుమ్ముదులిపేసింది. ఇప్పుడు పార్ట్ 2లో అంతకుమించి అనేలా ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మాస్ ట్యూన్ రెడీ చేశాడట. ఇలాంటి సాంగ్‌లో శ్రీలీల ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. శ్రీలీల డ్యాన్స్ గురించి అందరికీ తెలిసిందే. ధమాకా, గుంటూరు కారం సినిమాల్లో తన మాస్ డ్యాన్స్‌తో ఫిదా చేసింది శ్రీలీల.
అందుకే.. పుష్ప2లో శ్రీలీలతో ఐటెం సాంగ్ చేయించే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయితే.. ఇది కేవలం రూమరేనా? లేక నిజంగానే శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఇదే జరిగితే థియేటర్ టాపులు లేచిపోతాయ్. అసలే.. అల్లు అర్జున్ డ్యాన్స్ మామూలుగా ఉండదు. అలాంటిది.. బన్నీకి శ్రీలీల తోడైతే పీక్స్‌లో ఉంటుంది. ఇందులో నిజమెంత అనేది తెలియాలి అంటే.. ఆగష్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.