యాంకర్ శ్రీముఖి గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఓ విషయంలో మాత్రం శ్రీముఖి గురించి ఎప్పుడు హాట్ టాపిక్ నడుస్తునే ఉంది. అమ్మడు ఎవరితో ప్రేమలో ఉంది? తాజాగా శ్రీముఖినే స్వయంగా తన లవర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది.
Sreemukhi: అనసూయ, రష్మీ గౌతమ్‌ల తర్వాత ఆ రేంజ్‌లోనే యాంకర్‌గా పాపులర్ అయింది శ్రీముఖి. బుల్లితెర రాములమ్మగా గ్లామరస్ యాంకర్‌గా దూసుకుపోతోంది అమ్మడు. అయితే కేవలం బుల్లితెర యాంకర్‌గానే కాదు. మరోవైపు నటిగా సినిమాలు కూడా చేస్తోంది. గత ఏడాది విడుదలైన మెగాస్టార్ భోళా శంకర్ మూవీలో కీ రోల్ ప్లే చేసింది శ్రీముఖి. ఇలా కెరీర్ పరంగా జెట్ స్పీడ్‌లో ఉన్న శ్రీముఖి.. ప్రేమ వ్యవహారంలో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. శ్రీముఖి ఫలానా వ్యక్తితో ప్రేమలో పడింది.. తరచుగా వెకేషన్లకు వెళ్తోంది.. అంటూ జోరుగా ప్రచారం జరుగుతునే ఉంటుంది.
కానీ శ్రీముఖి ఎవరితో ప్రేమలో ఉందనేది పెద్దగా బయటకు రాలేదు. అయితే.. అమ్మడు పెళ్లికి రెడీ అవుతోందని.. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తతో ప్రేమ, పెళ్లికి అంటూ పుకార్లు వినిపించాయి. కానీ ఇవన్నీ పుకార్లేనని శ్రీముఖి కొట్టిపారేసింది. కానీ ఈసారి మాత్రం ఇతనితోనే ప్రేమలో ఉన్నానంటూ షాక్ ఇచ్చింది. అయిదే.. ఇది నిజం కాదులేండి. స్టార్ మాలో వస్తున్న సూపర్ సింగర్ షోలో భాగంగా శ్రీముఖి ఇలా చెప్పుకొచ్చింది. సూపర్ సింగర్ లేటెస్ట్ ఎపిసోడ్లో అనంత శ్రీరామ్‌తో కలిసి స్టెప్పులు వేసింది శ్రీముఖి. అయితే.. అనంత్ శ్రీరామ్ చేసిన పనికి.. నువ్వు తుంటరోడివి అని నాకు ముందే తెలుసు.. అందుకే నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అంటూ.. రాహుల్ సిప్లిగంజ్ని చూపించింది శ్రీముఖి.
రాహుల్ సిప్లిగంజ్ డ్రీమ్ గర్ల్ అంటూ నవ్వుతూ రిప్లే ఇచ్చాడు. ఇదంతా షో స్టంట్ తప్పా శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ ఏమి లేదు. కానీ.. ఈ ఇద్దరు మాత్రం బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీపడ్డారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలవగా శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. అందుకే.. ఇతనే నా లవర్ అంటూ చెప్పుకొచ్చింది.