»Mahesh Babu This Is The Last Movie Mahesh Babus Comments Are Viral
Mahesh Babu: ఇదే చివరి సినిమా.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్
ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో మాత్రం రీజనల్ సినిమాలే చేస్తున్నాడు. అయినా కూడా బాబు సినిమా వస్తే బాక్సాఫీస్ బద్దలవాల్సిందే. తాజాగా గుంటూరు కారం ఇంటర్వ్యూలో మహేష్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Mahesh Babu: కింగ్ ఆఫ్ రీజనల్ బాక్సాఫీస్‌గా పేరున్న మహేష్ బాబు.. త్రివిక్రమ్‌తో కలిసి గుంటూ కారం సినిమా చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. డే వన్ నుంచి డివైడ్ టాక్ సొంతం చేసుకున్న గుంటూరు కారం.. టాక్‌తో సంబంధంల లేకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్, 100 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అవుతోంది. అయితే.. మహేష్ బాబు నుంచి వచ్చిన లాస్ట్ రీజనల్ సినిమా ఇదే. ఈ మూవీ తర్వాత మహేష్ పాన్ ఇండియా-పాన్ వరల్డ్ మర్కెట్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని స్వయంగా మహేష్ బాబు చెప్పడం విశేషం.
ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తెలుగులో గుంటూరు కారం చివరి చిత్రం కావచ్చు. రీజనల్ లాంగ్వేజ్‌లో ఇకపై చిత్రాలు చేయకపోవచ్చు. డాన్సులు చేసే అవకాశం రాకపోవచ్చు. ఇలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని.. గుంటూరు కారం చిత్రాన్ని రూపొందించామని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. దీంతో బాబు కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్. దాదాపు వెయ్యి కోట్లతో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రాజమౌళి స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సమ్మర్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత మహేష్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోవడం గ్యారెంటీ. ఇదే విషయాన్ని మహేష్ చెప్పడంతో.. ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.