టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ సినిమా 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సూపర్ హీరో మూవీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో సినిమా పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా బాలయ్య 'హనుమాన్' సినిమా చూశారు.
Hanuman: ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సంక్రాంతి రేసులో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాకు పోటీగా.. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హనుమాన్ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో ఎంటర్ అయిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో 30 కోట్ల లాభాలు తెచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అటు అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్, తేజా సజ్జా యాక్టింగ్ అదిరిందని అంటున్నారు. లేటెస్ట్గా హనుమాన్ సినిమాను నటసింహం బాలకృష్ణ కూడా చూశారు. ఇక సినిమా చూసిన తర్వాత ప్రశాంత్ వర్మపై బాలయ్య ప్రశంసలు కురిపించారు. సినిమా కన్నుల పండగగా ఉందని అన్నారు. అలాగే.. ఆడియెన్స్‌తో పాటు హనుమాన్ సెకండ్ పార్ట్ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని బాలయ్య చెప్పారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి తెరకెక్కించారు. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.