SpiceJet: విమాన ప్రయాణంలో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ప్లైట్ టేక్ ఆఫ్ అయిన తరువాత ఓ ప్రయాణికుడు టాయిలెట్‌కు వెళ్లాడు. లాక్ చేసిన డోర్ ఓపెన్ అవలేదు. దీంతో సిబ్బందికి సమస్య చెప్పాడు. వారు అందరూ ఎంత ప్రయత్నించినా డోర్ ఓపెన్ అవలేదు. దాంతో ప్యాసింజర్ భయభాంత్రులకు గురయ్యాడు. దాదాపు రెండు గంటల పాటు బాత్రూంలోనే ఉన్నాడు. ఈ ఘటన సైస్‌జెట్ విమానంలో చోటుచేసుకుంది.
సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం SG268 విమానం ముంబయి(Mumbai) నుంచి బెంగళూరు(Bengalur) వెళ్తుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ప్రయాణికుడు టాయిలెట్‌కు వెళ్లాడు. టెక్నికల్ ప్రాబ్లమ్ వలన డోర్ ఓపెన్ కాలేదు. బాత్రూంలో ఉన్న ప్యాసింజర్ కేకలు పెట్టడంతో ఎయిర్‌హోస్టర్స్ విషయం తెలుసుకున్నారు. బయట నుంచి డోర్ తెరవడానికి ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. దాంతో సదరు వ్యక్తి భయంతో అరిచాడు. అతనికి ధైర్యం చెబుతూ దాదాపు 2 గంటలు అతనితో సిబ్బంది బయటనుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఇక ఫ్లైట్ బెంగళూరులో ల్యాండ్ అయిన తరువాత ఇంజనీర్లు వచ్చి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో డోర్లను పగలగొట్టారు. ప్యాసింజర్ క్షేమంగానే ఉన్నప్పటికి అతని ప్రథమచికిత్స అందించారు.
చదవండి:Mirzapur 3: మీర్జాపూర్ సీజన్ 3 రిలీజ్ డేట్ ఫిక్స్