»This Is The Reason For Quitting Politics Ambati Rayudu
Ambati Rayudu: రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నానంటే?
భారత క్రికెటర్ అంబటి రాయుడిని సీఎం జగన్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. కండువ కప్పుకొని రెండు వారాలు కాకుండానే అనుహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు రాయుడు. దీంతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడమే ఆయన పార్డీ వీడడానికి కారణం అని సర్వత్రా పుకార్లు వినిపిస్తున్నాయి. వాటికి చెక్ పెడుతూ తాజాగా అంబటి రాయుడు ఓ ట్వీట్ చేశాడు.
This is the reason for quitting politics Ambati Rayudu
Ambati Rayudu: స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) వైసీపీకి రాజీనామా చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దూమారం సృష్టించింది. స్వయంగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రాయుడు రెండు వారాలు తిరగకముందే పార్టీని వీడడం తీవ్ర చర్చకు దారితీసింది. గుంటూరు ఎంపీ సీటు ఇవ్వనందువల్లే రాయుడు వైసీపీని వదిలేశాడని సోషల్ మీడియాల్లో తీవ్ర ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాయుడు చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
“నేను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 పోటీల్లో పాల్గొంటున్నాను. జనవరి 20 నుంచి దుబాయ్ లో జరిగే ఈ పోటీల్లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ టోర్నీలో పాల్గొనే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండకూడదన్న నిబంధన ఉంది” అని రాయుడు ట్వీట్ చేశాడు. ఈ కారణంగానే ఆయన పార్టీ వీడినట్లు చెప్పుకొచ్చినా ఇంకా చర్చ మాత్రం ఆగలేదు. కచ్చితంగా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని అస్త్రంగా వాడుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
I Ambati Rayudu will be representing the Mumbai Indians in the upcoming ILt20 from jan 20th in Dubai. Which requires me to be politically non affiliated whilst playing professional sport.