ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో కూడా ఫిక్స్ అయ్యాడు.
Ram charan: రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ రోజు రోజుకి డిలే అవుతునే ఉంది. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా రీసెంట్‌గానే క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత మార్చి నుంచి బుచ్చిబాబు సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు చరణ్. ఇప్పటికే బుచ్చిబాబు ఎప్పుడో స్క్రిప్టు రెడీ చేసుకొని.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. మెయిన్ కాస్టింగ్ కూడా దాదాపుగా ఫైనల్ అయిపోయిందని అంటున్నారు. అయితే రీసెంట్గా మిగతా క్యాస్టింగ్ కోసం కాస్టింగ్ కాల్ ప్రకటించారు.
ఇది కూడా చూడండి: ISRO: అంతరిక్షంలో విజయవంతమైన ఇస్రో ఫ్యుయల్ సెల్ పరీక్ష
ఉత్తరాంధ్రా యాసలో తెలుగు మాట్లాడగలిగి యాక్టింగ్ వస్తే చాలు.. అన్ని వయసుల వారీగా తమ ప్రొఫైల్స్‌ను పంపించాల్సిందిగా కోరారు. ఇప్పటికే ఆడిషన్స్ కూడా జరిగిపోయి ఉంటాయి. దీంతో ఆర్సీ 16లో చాలామంది కొత్త నటీనటులు కనిపించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆర్సీ 16కి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా లాక్ అయ్యాడు. ఇటీవల రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో క్యామియో చేసిన శివన్న.. ఇప్పుడు ఆర్సీ16లో ఇన్వాల్వ్ కాబోతున్నాడని తెలియడంతో ఈ సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
సంక్రాంతికి రిలీజ్‌కు రెడీ అవుతున్న ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు శివన్న. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఉంది, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చాడు. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అన్నట్టు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉందంటున్నారు.