NGKL: వెల్దండ మండలం పెద్దాపూర్‌లో ‘ఉల్లాస్’ నవభారత సాక్షరత కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాక్షరత పరీక్షల నిర్వహణ, కర్యక్రమం అమలు తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో డీఆర్డీఏ అధికారులు, సర్పంచ్ అనూష కృష్ణ, ఉపసర్పంచ్ ప్రసాద్ చారి తదితరులు పాల్గొన్నారు.