TG: కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సభలో జరిగిన చర్చను పక్కదారి పట్టిస్తోందన్నారు. తాము పొంగులేటి అంశంపై సభా సంఘం వేయాలని లేవనెత్తితే.. రేవంత్ రెడ్డి కులాల ప్రస్తావన తీసుకువచ్చారని మండిపడ్డారు. కడియం, దానం ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలన్నారు. వారు BRSలోనే ఉన్నారని కౌశిక్ రెడ్డి చెప్పారన్నారు.