KRNL: కోడుమూరు కాలమ్మ వీధికి చెందిన ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చరణ్, ఈరన్న, కిరణ్ శనివారం సాయంత్రం నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా సమాచారం దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు ఇవాళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.