సిద్దిపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో న్యాయమూర్తులు పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా మొత్తం 5,454 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.