ASR: అరకు సంత వేలంపాటను రేపు నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి గుణలక్ష్మి తెలిపారు. వేలంపాటలో పాల్గొనదలచిన అభ్యర్థులు రూ.2,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలని సూచించారు. ఈసారి సంతను రూ.6.17 లక్షల ప్రాతిపదికన వేలంపాటకు పెడుతున్నామని, ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తామన్నారు. వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంత అభివృద్ధికి వినియోగిస్తామని ఆమె పేర్కొన్నారు.