సత్యసాయి: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని నిద్రగట్ట గ్రామ సమీపంలో కోడిపందాలు నిర్వహిస్తున్న స్థావరాలపై శనివారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అమరాపురం ఎస్సై వలి బాషా తన సిబ్బందితో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.23,850 నగదుతో పాటు 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.