MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ శివారులోని డంపింగ్ యార్డ్లో నిర్వహిస్తున్న బయోమైనింగ్ పనులను మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. శనివారం ఆయన పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్లో పర్యటించారు. మున్సిపల్ అధికారులు బయో మైనింగ్ పనుల గురించి ఆయనకు వివరించారు. పాత చెత్తను బయో మైనింగ్ పనులతో వేరు చేయడం వల్ల పర్యావరణానికి హాని జరగదని పేర్కొన్నారు.