Singareni Elections: సింగరేణి ఎన్నికలు ఈ నెల 27న యథావిధిగా జరగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలని సంస్థ యాజమాన్యం మధ్యంతర పిటీషన్ను జారీచేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది.. ఎన్నికల నిర్వహణకు కొంత సమయం ఇవ్వాలంటూ సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ కార్మిక సంఘానికి నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. డిసెంబర్ 27న యథావిధిగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. సింగరేణి ఎన్నికల బరిలో మొత్తం 13 కార్మిక సంఘాలు నిలిచాయి. 3 సంఘాల మధ్య బలమైన పోటీ ఉంది. క్టోబర్ నెలలోనే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.