కోనసీమ: ఆలమూరు పోలీస్ స్టేషన్లో ASI గా డి. సుబ్రహ్మణ్యస్వామి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించే క్రమంలో స్వామికి ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. ఆలమూరు ఏఎస్ఐ పోస్టు ఖాళీగా ఉండటంతో ఆయనను ఇక్కడే నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు స్వామి శనివారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.