KNR: ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన వినతులు స్వీకరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని బస్ స్టేషన్లలో టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. బస్ స్టేషన్ అభివృద్ధిలో ఆర్టీసీతో ఎమ్మెల్యేలు తమ ఫండ్స్ ద్వారా సహకరించాలని కోరారు.