VKB: 2026-27 సంవత్సరానికి గాను మర్పల్లి గ్రామ పంచాయతీ తైబజార్ వేలంపాటను ఈనెల 30న నిర్వహించనున్నట్లు కార్యదర్శి లక్ష్మీకాంత్ తెలిపారు. ఉదయం 10 గంటలకు పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ మధుగు రామేశ్వర్ ఆధ్వర్యంలో ఈ వేలం జరుగుతుంది. పాల్గొనేవారు రూ. 2000 డిపాజిట్ చేయాలని, వేలం పాడిన మొత్తంలో సగం డబ్బును అదే రోజు చెల్లించాలని సూచించారు.