KMR: హకీంపేట్ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతి ప్రవేశాల కోసం శనివారం ఇందిరా గాంధీ స్టేడియంలో కామారెడ్డి జిల్లా స్థాయి ఎంపికలు జరిగాయి. జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో 80 మంది విద్యార్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో రాష్ట్ర స్థాయి ఎంపికల కోసం 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంపిక చేశారు.