NLR: చేజర్ల మండలం ఆదూరుపల్లి GC పాఠశాలను డైట్ లెక్చరర్ అరిగెల విజయ్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులు, విద్యార్థుల ప్రతిభ, పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం వంటి అంశాలను పరిశీలించారు. అన్ని విభాగాల్లో పాఠశాల పనితీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని, ఉపాధ్యాయులను ప్రశంసించారు.