JGL: పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా మెడికల్ కళాశాల నిర్మాణ పనులను శనివారం పరిశీలించారు. అలాగే క్రిటికల్ కేర్ యూనిట్ ఆస్పత్రిని ఎమ్మెల్యే పరిశీలించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వీరితో పాటు జిల్లా వైద్యాధికారి సుజాత, ఉప వైద్యాధికారి శ్రీనివాస్, డా.విజయ్ రెడ్డి, డీఈ పాల్గొన్నారు.