NZB: జిల్లాలో ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలగకుండా అధికారులు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కార్పొరేటర్లు సూచించే ప్రజా సమస్యలను అంకితభావంతో పరిష్కరించాలని కోరారు. డివిజన్ల సమస్యలపై చర్చించేందుకు నెల రోజుల్లోపు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.