»Telangana Police Restrictions On New Year Celebration
Police Restrictions: న్యూ ఇయర్ వేడుకల పై ఆంక్షలు విధించిన పోలీసులు
కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరో పది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. దీంతో న్యూ ఇయర్ వేడుకలకు జనం సిద్ధమవుతున్నారు.
Police Restrictions: కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరో పది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. దీంతో న్యూ ఇయర్ వేడుకలకు జనం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు ప్రజలకు, కార్యక్రమ నిర్వాహకులకు పలు నిబంధనలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి 1 గంటలోపు ముగియాలి. ఈవెంట్ నిర్వాహకులు పది రోజుల ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ప్రతి కార్యక్రమం జరిగే ముందు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
ప్రతి కార్యక్రమానికి భద్రత తప్పనిసరి. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు. 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం చేయరాదు. సామర్థ్యానికి మించి పాస్లు ఇవ్వొద్దు. పార్కింగ్ సమస్య లేకుండా, సామాన్యులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసుకోవాలి. మద్యం కార్యక్రమాలకు మైనర్లను అనుమతించకూడదు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమయానికి మించి మద్యం సరఫరా చేయవద్దు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే పది వేల రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.