MHBD: చిన్నగూడూరు మండలకేంద్రంలోని పదవతరగతి పరీక్షకేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థులు సైతం ఎటువంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచనలు చేశారు.