NGKL: తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ను నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు యువతలో ఆరోగ్యం, క్రమశిక్షణ పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.