»Imf Estimates Indias Growth Rate 20232024 Fiscal Financial Year Is 6 3
IMF: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ వద్ధి రేటు 6.3%!
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, వచ్చే ఏడాది కూడా 6.3 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనాలను వెల్లడించింది. దీంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ గురించి కీలక విషయాలను గుర్తు చేసింది.
భారతదేశం స్థూల ఆర్థిక స్థిరత్వం మద్దతుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా భారత వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనా వేసింది. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బలమైన ప్రభుత్వ అవస్థాపన కార్యక్రమాలు వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపింది. IMF తన ఆర్టికల్ IV సంప్రదింపు నివేదికలో భాగంగా వెల్లడించింది.
దేశంలో సంస్కరణలు మరింత అమలు చేయబడితే, కార్మిక, మానవ మూలధనం నుంచి ఎక్కువ సహకారం అందుతుందని తెలిపింది. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో భారత్‌లో మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉందని చెప్పింది. అవసరమైన లాజిస్టిక్స్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గణనీయమైన కృషి చేస్తుందని గుర్తు చేసింది. ఆ క్రమంలో భారతదేశం మరింత అధిక వృద్ధి సాధించే అవకాశం ఉందని IMF పేర్కొంది. మార్చి 31, 2024తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి IMF వృద్ధి అంచనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7 శాతం కంటే తక్కువగా ఉంది.
అయితే ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యానికి అనుకున్నట్లుగా చేరడం లేదని గుర్తు చేసింది. దీని కారణంగా ఆహార ధరలు అస్థిరంగానే ఉంటాయని IMF తెలిపింది. ఇక నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 4.87 శాతం నుంచి 5.55 శాతానికి పెరిగింది. ఇది RBI టోలరెన్స్ బ్యాండ్ 2 శాతం నుంచి 6 శాతం మధ్యలో ఉండగా, ఇది లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉండటం విశేషం.