»Imf Boosts Indias 2023 24 Gdp Growth Chinas Gdp Decrease
India GDP వృద్ధి పెంచి, చైనాకు తగ్గించిన IMF
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మంగళవారం చైనా, యూరో ప్రాంతాల వృద్ధి అంచనాలను తగ్గించింది. కానీ భారత్ వృద్ధి రేటు అంచనాలను మాత్రం ఈ సారి పెంచింది. మరోవైపు ప్రపంచ వృద్ధి తక్కువగా, అసమానంగా ఉందని పేర్కొంది.
IMF boosts India's 2023-24 GDP growth China's gdp decrease
బలమైన వినియోగ డిమాండ్ నేపథ్యంలో 2023-24లో భారతదేశ జీడీపీ GDP వృద్ధి అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 6.3 శాతానికి పెంచింది. మరోవైపు చైనా వృద్ధి రేటును 5 శాతానికి తగ్గించింది. భారత్‌లో వృద్ధి 2023, 2024 రెండింటిలోనూ 6.3 శాతం వద్ద బలంగా ఉంటుందని అంచనా వేసింది. 2023కి 0.2 శాతం పాయింట్‌తో సవరించింది. ఇది ఏప్రిల్-జూన్‌లో ఊహించిన దాని కంటే బలంగా ఉంటుందని IMF తన వార్షిక ఎకనామిక్ ఔట్లుక్ (WEO) నివేదికలో మంగళవారం తెలిపింది.
మరోవైపు IMF తన తాజా వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ (WEO)లో 2023లో గ్లోబల్ రియల్ జీడీపీ వృద్ధి 3.0 శాతం వద్ద మార్చకుండా ఉంచింది. 2024 అంచనాను 0.1 శాతం తగ్గించి జూలై అంచనా నుంచి 2.9 శాతానికి తగ్గించింది. COVID 19 మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, గత సంవత్సరం ఇంధన సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కొనసాగిందని IMF చీఫ్ ఎకనామిస్ట్ పియరీ ఒలివర్ గౌరించాస్ అన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వృద్ధి పోకడలు చాలా భిన్నంగా ఉన్నాయని, మధ్యకాలిక వృద్ధికి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం, అస్థిర వస్తువుల ధరలు, భౌగోళిక, రాజకీయం, ద్రవ్యోల్బణం వంటి అంశాల కారణంగా వృద్ధి మందగించే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు పెరుగుతున్న వడ్డీ రేట్లు, విపరీతమైన వాతావరణ సంఘటనలు బలమైన ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటున్నట్లు IMF ప్రస్తావించింది. 2023లో ఇది మొత్తం గ్లోబల్ అవుట్‌పుట్ 3.4 శాతం లేదా దాదాపు $3.6 ట్రిలియన్లు ఉన్నట్లు తెలిపింది. తాము ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చూస్తున్నామని, అది క్రమంగా పెరిగే అవకాశం ఉందని, ఇంకా వేగంగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.