»Top 5 Best Laptop Deals At Amazon Great Indian Festival 2023
Top 5 Best Laptop Deals 2023: టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్!
ఈ పండుగ సీజన్లో మీరు గేమింగ్ లేదా మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సందర్భంగా టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్ గురించి ఇప్పుడు చుద్దాం.
Acer Nitro V ప్రస్తుతం ఇది గేమింగ్ కోసం బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్ అని చెప్పవచ్చు. అమెజాన్ ఆఫర్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే లభిస్తుంది. ఇది Nvidia RTX 4050 గ్రాఫిక్స్ కార్డ్‌ని కలిగి ఉంది. దీంతోపాటు RTX 40 సిరీస్ GPU, DLSS 3 ఫ్రేమ్ జనరేషన్, AI సపోర్ట్ తో వస్తుంది. ఇంటెల్ 13వ జెన్ ప్రాసెసర్, DDR5 RAM, అధిక రిఫ్రెష్-రేట్ డిస్ప్లే సహా మరిన్ని ఫీచర్లతో అందుబాటులో ఉంది.
అయితే దీని అసలు ధర రూ.76,990 ఉండగా.. విక్రయ ధర: రూ.70,990 (8% తగ్గింపు)గా ఉంది.
2. ఏసర్ ఆస్పైర్ 5 A515-57G
సూపర్ గేమింగ్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్న వారికి ఎసెర్ ఆస్పైర్ 5 సరైనదని చెప్పవచ్చు. దీంతోపాటు రూ.50,000లోపు Acer అందించే స్పెసిఫికేషన్లు, ఫీచర్లలో దీనిని ఎంపిక చేసుకోవచ్చు. Nvidia DLSS వంటి ఆధునిక AI ఫీచర్లను ఇది కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో 16GB RAM, 12-కోర్ ఇంటెల్, i5 ప్రాసెసర్, డిస్ప్లే బ్లూ లైట్ షీల్డ్ టెక్నాలజీతో 15.6-అంగుళాల IPS ప్యానెల్ తో వస్తుంది. ఇది Acer PurifiedVoice వంటి అదనపు AI ఫీచర్లతో లభిస్తుంది.
(దీని అసలు ధర: రూ.54,990, విక్రయ ధర: రూ.49,990 (9% తగ్గింపు)
3. HP Victus 15 fb0134AX
HP Victus 15 అనేది AMD ప్రాసెసర్, డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్‌తో వస్తున్న మంచి ల్యాప్‌టాప్. ఇది ఆకట్టుకునే క్వాలిటీ, డిజైన్, మంచి స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 5600H 6-కోర్ ప్రాసెసర్, 4GB GDDR6 VRAMతో Radeon RX 6500M గ్రాఫిక్స్‌తో ప్యాక్ చేయబడింది. 16GB RAM, 60Hz వేరియంట్, 144Hz డిస్ప్లే వంటి ఫీచర్లతో అందుబాటులో ఉంది.
(అసలు ధర: రూ. 57,290 | విక్రయ ధర: రూ. 52,990 (8% తగ్గింపు)
4. Apple MacBook Air M1
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సందర్భంగా M1 మ్యాక్‌బుక్ ఎయిర్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇది MacOSతో పొందవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ & బ్యాంక్ డిస్కౌంట్లను కలుపుకుంటే M1 MacBook Air ధర రూ. 52,999కు లభించనుంది. ఇది సైలెంట్ ఫ్యాన్‌లెస్ డిజైన్ తో బ్యాటరీ లైఫ్‌తో కూడిన పోర్టబుల్ ల్యాప్‌టాప్. M1 చిప్‌లో 8-కోర్ CPU, 7-కోర్ GPU ఉంటాయి. ఇది 13.3-అంగుళాల (2560 x 1600) రెటీనా డిస్ప్లే, మ్యాజిక్ కీబోర్డ్, ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్, స్పీకర్స్ వంటి ఫీచర్లను కల్గి ఉంది. అయితే దీని అసలు ధర: రూ. 82,990 ఉండగా..విక్రయ ధర: రూ.67,990 (18% తగ్గింపు)గా లభిస్తుంది.
5. Xiaomi నోట్‌బుక్ అల్ట్రా మాక్స్
Xiaomi నోట్‌బుక్ అల్ట్రా ల్యాప్‌టాప్. ఇది అద్భుతమైన ఫీచర్లు, సరసమైన ధరల్లో లభించే బెస్ట్ ల్యాప్ టాప్. దీనిలో ఇంటెల్ కోర్ i5-11320H ప్రొసెసర్, ఇంటిగ్రేటెడ్ Iris Xe గ్రాఫిక్స్ కార్డు, 16GB DDR4 ర్యామ్, 3.2K రిజల్యూషన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి అనేక ఫీచర్లను కల్గి ఉంది. అయితే దీని అసలు ధర: రూ. 49,990 ఉండగా..విక్రయ ధర: రూ.46,990 (6% తగ్గింపు)గా అందుబాటులో ఉంది.