W.G: ఉండి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలంలో వివిధ గ్రామాల సర్పంచ్లను ఉండి MPP ఇందుకూరి హరిబాబు సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ల సహకారం మరువలేనిది అన్నారు. ఉండి సర్పంచ్ కమతం సౌజన్య, చెరుకువాడ సర్పంచ్ కొండవీటి శివయ్య, వాండ్రం సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, ఉణుదుర్రు సర్పంచ్ పిన్నంరాజు నాగలక్ష్మి తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో MRO నాగార్జున పాల్గొన్నారు.