AP: 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. అమరావతిపై కక్ష కట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. అమరావతి రైతులకు మద్దతుగా తాను వెళ్తే.. ముళ్ల కంచెలు వేశారన్నారు. వైసీపీ హయాంలో శాసనసభ్యులకే రక్షణ లేకపోతే.. రైతులకు రక్షణ ఎలా ఉంటుందన్నారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా.. ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నామన్నారు.