TG: హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. L&T నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి.. ఈ ఏకగ్రీవ తీర్మానానికి సభ్యులంతా ఆమోదం తెలపాలని కోరారు. మెట్రో విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే స్వాధీన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.