టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రి కాబోతున్నట్లు తెలిపారు. తన భార్య భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని తెలియజేశారు. దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారంటూ ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. తన అత్తమ్మ భూమా పుట్టినరోజు సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంటూ ఈ గుడ్ న్యూస్ ను చెప్పారు. అన్నయ్యగా తనకు ప్రమోషన్ రానున్న తరుణంలో భూమా మౌనికా రెడ్డి కుమారుడు ధైరవ్ చాలా సంతోషంగా ఉన్నట్లు మంచు మనోజ్ తెలిపారు.
తన అత్తమ్మ, మావయ్య ఎక్కడున్నా తమను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారన్నారు. అలాగే తన తల్లి నిర్మల, తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో తమ కుటుంబం చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ పెళ్లి తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. అటు సినిమా, ఇటు బుల్లితెర షోతో బిజీగా ఉన్నారు. వాట్ ద ఫిష్ అనే సినిమా చేస్తున్నారు. అలాగే మంచు మనోజ్ ఉస్తాద్ అనే టీవీ షో కూడా చేస్తున్నారు.