»Bhairavam Movie Team Support To Director Vijay Kanakamedala
కనకమేడలకి భైరవం టీం సపోర్ట్
ఎంతో వ్యయప్రయాసలకోర్చి ప్రముఖ నిర్మాత రాధామోహన్ నిర్మించిన భైరవం సినిమా ఈ నెల 30న విడుదలవుతుందనగా ఒక్కసారి పాత తప్పిదంలా అనిపించే ఓ ఘటన నిప్పు రాజేసింది. గతంలో ఎప్పుడో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేసిన టైంటో కనకమేడల పెట్టిన పోస్ట్ ఇప్పుడు తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చి, దర్శకుడి మెడకి చుట్టుకుంది.
ఎప్పుడో జరిగింది ఇప్పుడు తలకి చుట్టుకుంది దర్శకుడు విజయ్ కనకమేడలకి. రచ్చరచ్చ అయిపోయింది. అదీ కరెక్టుగా ఎంతో వ్యయప్రయాసలకోర్చి ప్రముఖ నిర్మాత రాధామోహన్ నిర్మించిన భైరవం సినిమా ఈ నెల 30న విడుదలవుతుందనగా ఒక్కసారి పాత తప్పిదంలా అనిపించే ఓ ఘటన నిప్పు రాజేసింది. గతంలో ఎప్పుడో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేసిన టైంటో కనకమేడల పెట్టిన పోస్ట్ ఇప్పుడు తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చి, దర్శకుడి మెడకి చుట్టుకుంది. చిరంజీవిని, రామ్ చరణ్‌ని పా సినిమా పోస్టర్ టైపులో కనకమేడల ఒక పోస్ట్ పెట్టాడు. దాన్ని మెగాఅభిమానులు ఇప్పుడు నూతనంగా తెరమీదకి తీసుకొచ్చి, బాయ్‌కాట్ భైరవం అనే ఆగ్రహ నినాదాలు ప్రారంభించారు.
దెబ్బకి వాతావరణం వేడెక్కిపోయింది. ఇటీవలి రోజుల్లో లైలా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంది. ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు పృధ్వీ చేసిన వ్యాఖ్యానం విష్వక్సేన్ నడ్డి విరిచేసింది. వైఎస్పార్ సిపి పృధ్వీ మాటలకి ఉడుక్కుని బాయ్‌కాట్ లైలా అని సోషల్ మీడియాలో విజృంభించేశారు. దానికి బెంబేలెత్తిపోయిన విష్వక్సేన్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఏడ్చేసినంత పని చేశాడు. కానీ ఏ ఉపయోగం లేకుండా పోయింది. లైలా డిజాస్టర్ అయింది. కానీ అదేదో బాయ్‌కాట్ పిలుపు వల్ల కాదు. లైలా సినిమాలో దమ్ము లేక ఢమాల్‌మంది.
ఇప్పుడు అటు మెగాఫాన్స్ ప్లస్ జనసేన శ్రేణులతో కలసిపోయి, వైయస్సార్ మూకలు కూడా బాయ్‌కాట్ అంటూ తోకతొక్కుతున్నారు. అందుకే భైరవం సినిమాలో వన్ ఆఫ్ ది హీరోస్గా చేస్తున్న మంచు మనోజ్ నిన్న ఘనంగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు కనకమేడలకి సంఘీభావం తెలిపాడు. మెగాఫాన్స్ని ఉద్దేశించి, విజయ్ కనకమేడల కూడా మెగాఫానే అని, జరిగిన దానికి తాను క్షమాపణలు చెబుతున్నానని సవివరంగా మాట్లాడాడు.
ఎవరో, ఇంకెవరో మాట్లాడితే ఎలా ఉండేదో రియాక్షన్. కానీ మెగాఫాన్సే కాదు, అందరిలోనూ చాలా పాజిటివ్ ఇమేజ్ ఉన్న మంచు మనోజ్ సంజాయిషీ ఇవ్వడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. మెగాఫాన్స్ ప్రపంచంలోకి తిరుగులేని పాజిటివ్ మెసేజ్ చేరుకున్నట్టుగా మెగాఫాన్స్ లో కొందరు చెబుతున్నారు. పైగా భైరవం సినిమాకి పవర్ఫుల్ టాక్ ఉంది. శ్రీచరణ్ పాకాల చేసిన పాటలు దుమ్ము లేపుతున్నాయి. ముగ్గురు హీరోలు…..బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ముగ్గురి కాంబినేషన్ మీద హై ఎలివేషన్ అల్లుకుంది. ముగ్గురికీ ముగ్గురూ ప్రేక్షకలోకంలో మంచి రికార్డు సంపాదించుకున్నవారే కావడం ఇక్కడ భైరవం సినిమాకి మంచి ప్లస్ అయింది. సినిమా బిజినెస్‌ని కూడా ఎర్లీగానే క్లోజ్ చేయగలిగారు. ఈ ఆందోళనని అధిగమించి, దర్శకుడు విజయ్ కనకమేడల కృషి తీపి ఫలాలనే అందిస్తుందని అందరూ అనుకుంటున్నారు.