KMR: జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 99.76 శాతం హాజరు నమోదైనట్లు డీఈవో రాజు తెలిపారు. 13,154 మంది విద్యార్థులకు గాను 13,122 మంది హాజరుకాగా, 32 మంది గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు.