NGKL: రాంనగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం 6:45 గంటలకు రథోత్సవం జరగనుంది. శ్రీ సీతారామచంద్రస్వామి, లక్ష్మణ, హనుమాన్ సమేత ఉత్సవమూర్తులు రామాలయం నుంచి బస్టాండ్ వరకు ఊరేగింపుగా వెళ్లనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని నిర్వాహకులు కోరారు. అనంతరం తీర్థ ప్రసాదాల పంపిణీ నిర్వహించనున్నారు.